Friday, May 31, 2024
Friday, May 31, 2024

బాస్కెట్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

విశాలాంధ్ర-రాప్తాడు : మండల పరిధిలోని సెయింట్ విన్సెంట్ డీపాల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పదవ తరగతి చదువుతున్న బి. జాన్సన్ కుమార్ అత్యంత ప్రతిభ కనబరిచి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యాడు.ఈనెల 23వ తేదీన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం జడ్పీహెచ్ఎస్ లో జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు. అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల హెచ్ఎం సిస్టర్ అమల, సుపీరియర్ జనరల్ సిస్టర్ జ్ఞానమ్మ, కరస్పాండెంట్ సిస్టర్ జెసింత, పీఈటీ నారాయణరెడ్డి అభినందించారు. హెచ్ఎం అమల మాట్లాడుతూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం హర్షణీయమని, రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి జాతీయ జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించడం వల్ల భవిష్యత్తులో విద్య ఉద్యోగ అవకాశాల్లో క్రీడలకు రెండు శాతం రిజర్వేషన్ ఉంటుందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img