Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ప్రభుత్వ ఆసుపత్రికి మంచినీటి ఆర్వో ప్లాంట్ విరాళం

ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జ్ సూపర్డెంట్ డాక్టర్ నజీర్
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి రెండు లక్షల 50 వేల రూపాయలు విలువచేసే మంచినీటి ఆర్వో ప్లాంటును రోగులకు, ఆసుపత్రి సిబ్బందికి ఉపయోగపడుతుందన్న ఆలోచనతో శనివారం ఇవ్వడం జరిగిందని దాత పళ్లెం జనార్ధన్ భార్య పళ్లెం నిర్మల తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి పట్టణముతో పాటు, వివిధ గ్రామాల నుండి ఆరోగ్య వైద్య పరీక్షలకు వస్తారని, అటువంటి అప్పుడు నాణ్యతతో కూడిన మంచి నీటిని అందించాలన్న సంకల్పంతో, ఈ ఆరో ప్లాంట్ ను ఏర్పాటు చేయడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఆర్ వో ప్లాంట్ విషయములో ప్రోత్సహించిన మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం పార్థసారధి, పళ్లెం వేణుగోపాల్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆసుపత్రి ఇంచార్జ్ సూపర్డెంట్ నజీర్ దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి వారు మాట్లాడుతూ ఈ ఆర్ ఓ ప్లాంటు రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని, ఆరోగ్యానికి అతి ముఖ్యమైన నీరు అని వారు తెలిపారు. ఈ ఆరో ప్లాంట్ రోగులకు ఒక వరములా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉదయభాస్కర్, డాక్టర్ వెంకటేశ్వర్లు, నర్సింగ్ సూపర్డెంట్ రమాదేవి రేడియోగ్రాఫర్ రామ్మోహన్ తదితర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img