Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

వాటర్ ప్లాంట్ షాపులను పరిశీలించిన మున్సిపల్ ఇంజనీర్ విభాగ్ అధికారులు

విశాలాంధ్ర – ధర్మవరం : నేడు పట్టణంలో విచ్చలవిడిగా వాటర్ ప్లాంట్ లలో నాణ్యతలేని తాగునీరును సరఫరా చేస్తుండడంతో, ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో తాత్కాలిక చైర్మన్ భాగ్యలక్ష్మి ఆదేశాల మేరకు వాటర్ ప్లాంట్ కేంద్రాలను పరిశీలించాలన్న ఆదేశాల మేరకు, శనివారం మున్సిపల్ ఇంజనీర్ విభాగం ఈఈ. సత్యనారాయణ, ఏఈ హరీష్ కుమార్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషాలు ఆకస్మిక తనిఖీలో భాగంగా శారద నగర్ లో గల వాటర్ ప్లాంట్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాటర్ ప్లాంట్ యాజమాన్యంతో ఈ సత్యనారాయణ మాట్లాడుతూ.. మెంబర్ రైన్ లో నాణ్యత గల నీటి కోసం ఆరు నెలలకు ఒకసారి పరిశుభ్రం చేయాలని వారు తెలిపారు. అప్పుడే ప్రజలకు నాణ్యత గల తాగునీరు లభిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఫిల్టర్ వాటర్ ను అధిక రేట్లతో ఎందుకు విక్రయిస్తున్నారని? అడగడంతో, విద్యుత్ ఛార్జీలు అధికమైనందున విధిలేని పరిస్థితుల్లో ఫిల్టర్ వాటర్ ను అధిక రేట్లకు విక్రయించాల్సి వస్తోందని వారు తెలిపారు. వాటర్ ఫిల్టర్ కేంద్రాలలో నాణ్యత గల మంచి నీటిని మాత్రమే విధిగా ప్రజలకు అందించాలని, నియమ నిబంధనలను ఉల్లంఘించినచో, చట్టప్రకారం చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img