Friday, April 26, 2024
Friday, April 26, 2024

పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత…

ఎన్ఎన్సిఎస్ సి.. జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి

విశాలాంధ్ర-ధర్మవరం : పర్యావరణాన్ని పరిరక్షణ పరిరక్షించడం మరియు ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎన్సిఎస్సి జిల్లా కోఆర్డినేటర్.వెంకటస్వామి, జిల్లా అకాడమీ. కోఆర్డినేటర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మండల పరిధిలోని గొట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఇందులో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షించడం కాలుష్య నివారణ, ప్లాస్టిక్ నివారణ, మొక్కలను పెంచడం, పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన పెంపొందించడం జరిగింది. తదుపరి పై విషయాలలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, బహుమతులతో పాటు సర్టిఫికెట్లను కూడా పంపిణీ చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ భవిష్యత్తులో పర్యావరణాన్ని రక్షించే బాధ్యత విద్యార్థులు విద్యార్థులతో పాటు యువకులదని తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం అందరూ మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణయతగా విశ్వనాథ్, పాఠశాల ఉపాధ్యాయులు అమర్నాథ్,సిఆర్పిలు, విద్యార్థులు, యువకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img