Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఈనెల 27న పాలీసెట్ పరీక్షలు నిర్వహణ. ప్రిన్సిపాల్.. జేవి. సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం:: ఈనెల 27న పాలీసెట్ పరీక్ష లు నిర్వహిస్తున్నట్లు పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్- జెవి. సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ ప్రవేశం కొరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.. పరీక్షలు ఉదయం11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులందరూ ఉదయం 10 గంటలకే పరీక్షా గదులలో ప్రవేశంలో ఉండాలని ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబడదని తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు పెన్ను, పెన్సిలు, ఎర్రేసర్,షార్ప్నర్ మాత్రమే తీసుకొని రావలెనని తెలిపారు. క్యాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, జామెంట్రీ బాక్సులు, తదితరవి పరీక్షా గదులకు అనుమతించబడుదని తెలిపారు. పట్టణంలో కొత్తపేట లోగల ఎస్. పి. సి. ఎస్. మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల, కొత్తపేటలోని పురపాలక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల- గుట్ట కింద పల్లి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తారకరామాపురం, కొత్తపేటలోని ఉషోదయ హై స్కూల్, సంజయ్ నగర్ లోని బి ఎస్ ఆర్ బాలుర మునిసిపల్ ఉన్నత పాఠశాల, సంజయ్ నగర్ లోని బిఎస్సార్ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, సుందరయ్య నగర్ లోని శ్రీ గణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల లో పరీక్షా కేంద్రాలుగా ఉంటాయని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి కావడం జరిగిందని, విద్యార్థులందరూ కూడా సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని వారు మరోసారి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img