Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

బెస్త కులస్తులకు అధిక ప్రాధాన్యత కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కె.వి.రమణ

విశాలాంధ్ర- ఉరవకొండ( అనంతపురం జిల్లా) : స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బెస్త కులాన్ని( గంగపుత్ర) గుర్తించి అక్కునకు చేర్చుకొని రాజకీయంగా సామాజికంగా అత్యధిక ప్రాధాన్యత కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కెవి రమణ అన్నారు. గురువారం స్థానిక వైసిపి పార్టీ కార్యాలయంలో బెస్త కులస్తులకు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను వారి విడుదల చేశారు
ఈ సందర్భంగా సంఘం నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బెస్త కులస్తులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు ఎమ్మెల్సీలు,ఒక రాజ్యసభ, ఒక మంత్రి పదవి, ఇచ్చి చట్టసభల్లోనే కాకుండా సమాజంలో సగౌరవంగా తలెత్తుకునేటట్లు చేశాడని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇద్దరికీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం కల్పించారన్నారు. బెస్త కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక చైర్మన్ మరియు 12 మంది రాష్ట్ర డైరెక్టర్లను నియమించడం జరిగిందన్నారు అంతేకాకుండా పార్టీ పదవులలో కూడా ముగ్గురు కు జిల్లా అధ్యక్షులకు అవకాశం కల్పించారని వీటితోపాటు అనేక మంది బెస్త కులస్తులకు ఉన్నత పదవులలో కూడా అవకాశం కల్పించారన్నారు. మిగిలిన బీసీ కులాలతో సమానంగా గతంలో ఏ నాయకుడు చేయని విధంగా బెస్త కులస్తుల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేశారని అన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నవరత్నాల సంక్షేమ పథకాలతో కూడా బెస్త కులస్తులు ఎంతో ఆర్థిక అభివృద్ధి సాధించారన్నారు. సముద్ర తీర ప్రాంతంలో గల గంగపుత్రులకు మత్స్యకార భరోసా, యంత్ర పడవలు మోటర్ పడవలు, అందించడంతోపాటు వేట నిషేధ కాలంలో మత్స్యకార భరోసా కింద పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరుగుతుందన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు పరిహారం అందించుచున్నాడని తెలిపారు వీటితోపాటు ఫిష్ మాల్ నిర్మాణం ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశాడని మత్స్య ఉత్పత్తులలో దేశంలోనే ఆంధ్ర ని అగ్రగామిగా నిలిపాడని తెలిపారు. మత్స్యకారుల కోసం నాలుగు హార్బర్లు 10 షిప్ ల్యాండింగ్ కేంద్రాలు ఒక మత్స్య యూనివర్సిటీని ఏర్పాటుచేసిన ఘనత జగన్ కే దక్కింది అన్నారు. ఉరవకొండ పట్టణంలో బెస్త కులస్తులకు ప్రస్తుత వైసిపి అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి సహాయ, సహకారాలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 13 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. గతంలో చంద్రబాబునాయుడు పాలనలో గంగపుత్రులకు తీరని అన్యాయం చేశాడని తెలిపారు. బెస్త కులస్తులకు ఇంతటి ప్రాధాన్యత కల్పించిన జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం బెస్త కులస్తులకు ఎంతైనా ఉందన్నారు. ఉరవకొండలో విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బెస్త సేవా సంఘం నాయకులు ఎర్రి స్వామి, రామన్న, ఆనంద్, ఎర్రి స్వామి, హనుమంతు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img