Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీని ప్రారంభించిన జడ్పీ సీఈవో

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ప్రపంచ మలేరియా దినోత్సవము ను పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుండి సప్తగిరి సర్కిల్ వరకు అవగాహనా ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ మహా ర్యాలీని జిల్లా పరిషత్ ముఖ్య ప్రణాళిక అధికారిణి మైఖోమ్ నిదియా దేవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. జిల్లాలో మలేరియా ప్రభావిత ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా పరిగణించి గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో, సమన్వయంతో ఆరోగ్య సిబ్బంది ముందస్తు వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేశారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ భ్రమరాంబికా దేవి మాట్లాడుతూ… దోమల వల్ల వచ్చే మలేరియా మరియు డెంగీ వ్యాధుల నివారణకు సంబంధించి ఆరోగ్య సిబ్బంది ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి దోమలు గుడ్లు పెట్టే ప్రాంతాలను, దోమలు పెరిగే ప్రదేశాలను, పరిసరాల పరిశుభ్రతను గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పంచాయతీరాజ్, మునిసిపల్, మహిళా శిశు సంక్షేమ శాఖల సహకారంతో కీటక జనిత వ్యాధుల నిర్మూలనకు కృషి చేయాలని తెలియజేశారు. 2027 వ సంవత్సరం నాటికి మలేరియాను ఎలిమినేషన్ స్థాయికి, 2030 వ సంవత్సరం నాటికి నిర్మూలన చేయాలనేది ప్రభుత్వ ముఖ్య లక్ష్యం అని దీనిని సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. జిల్లా మలేరియా నివారణ అధికారి ఓబులు మాట్లాడుతూ… ప్రతి శుక్రవారం నీటి నిల్వలను శుభ్రపరచుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మలేరియా వ్యాధి బారిన పడకుండా నివారించుకోవచ్చునని తెలిపారు. అనంతరం ఈ ర్యాలీ టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు నిర్వహించారు.
ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ సుజాత, టిబి ఎయిడ్స్ నియంత్రణ అధికారిణి డాక్టర్ అనుపమ జేమ్స్, జిల్లాఇమ్మునైజషన్ అధికారి డాక్టర్ యుగంధర్, జిల్లా ఎన్ హెచ్ ఎం అధికారి డాక్టర్ రవి శంకర్, ఎన్ సి డి సి డి ప్రోగ్రాం అధికారి డాక్టర్ నారాయణస్వామి, జిల్లా మాస్ మీడియా అధికారి ఉమాపతి, సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ, డిప్యూటీ హెచ్ ఈ వో గంగాధర్, అనంతపురం మలేరియా సబ్ యూనిట్ అధికారి మద్దయ్య, విస్తరణ అధికారి గిరిధర్ రెడ్డి, రమేష్,సూపర్వైజర్లు నూర్ భాషా, శ్రీధర్ మూర్తి, రమేష్, రాఘవేంద్ర రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, మునిసిపల్ కార్యాలయ ఏ ఎస్ ఓ ప్రవీణ్, అనంతపురం వార్డు సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు, నగరంలోని వివిధ నర్సింగ్ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img