Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

మానసిక ఉల్లాసానికి దోహదపడేవి క్రీడలు

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎంపీపీ అనూష దేవి సర్పంచ్ పుష్పలత

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- మానసిక ఉల్లాసానికి, శారీరక దారుడ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఎంపీపీ కోరాబు అనూష దేవి అన్నారు. స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత తో కలిసి ఆమె గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ద యూనిటీ కప్ సెకండ్ సిరీస్ హార్డ్ టెన్నిస్ బాల్ సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా క్రీడాకారులను వారు పరిచయం చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుడ్యానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు దాతలు విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించారన్నారు. ఈ టోర్నమెంట్ లో ప్రధమ విజేతకు 50 వేల రూపాయలు, ద్వితీయ విజేతకు 20 వేల రూపాయల నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు అదే క్రమంలో నల్లల శివ సాయి వీ డి ఎస్ ఆర్థిక సహకారంతో విన్నర్ ట్రోఫీ, కేపీ రాజు ఆర్థిక సహాయంతో రన్నర్ ట్రోఫీ, స్థానిక ఎంపీటీసీ దారలక్ష్మి, మత్యరాజు దంపతుల ఆర్థిక సహాయంతో బెస్ట్ టీం ట్రోఫీ లు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు ఎంపీపీ అనూష దేవి 20వేల రూపాయలు, సర్పంచ్ పుష్పలత, హేమంత్ దంపతులు పదివేల రూపాయలు, స్థానిక ఇంజనీరింగ్ జేఈలు (జ్యోతి బాబు, లోకేష్ లు) 20వేల రూపాయలు, ప్రసాద్, నాగేంద్ర లు సంయుక్తంగా పదివేల రూపాయలు అందించారని, అదేవిధంగా టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన వివిధ అవసరాలను గ్రామంలోని యూత్ సమకూర్చాలని వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షుడు మోరి రవి, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ నాజర్ వల్లి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం విజయభారతి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస పాత్రుడు, అధ్యాపకులు లీలా పావని, కేజియా, సంతోషి, రమణ, బాలరాజు, జగదీష్ బాబు, నిర్వాహకులు క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img