Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

విద్యుత్ బిల్లులు ముట్టుకుంటే షాక్ తగులుతోంది

విద్యుత్తు ఏఈ కి వినతి పత్రం

జగన్ చేతకాని తనం, స్వార్థ ప్రయోజనాలతో విద్యుత్ రంగం కుదేలు
ఆత్మకూరు మండల సిపిఐ నాయకులు ఆగ్రహం

విశాలాంధ్ర- ఆత్మకూర్ : రాష్ట్రంలో ప్రజలు విద్యుత్ బిల్లులు ముట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి వచ్చిందని ఆత్మకూరు మండల సిపిఐ కార్యదర్శి సనప నీళ్లపాళ్ల రామకృష్ణ, సహాయ కార్యదర్శి బండారు శివ సోమవారం ఆత్మకూరు మండల విద్యుత్ శాఖ ఏఈ దాసుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంపుపై వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచినారు. ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక్కసారి ప్రజలు చూసుకోవాలన్నారు. సీఎం జగన్ రెడ్డి చర్యలతో విద్యుత్‌ రంగం కుదేలైందన్నారు. అప్రకటిత విద్యుత్‌ కోతలతో రాష్ట్రాన్ని అంథకారంలోకి నెట్టేశారని విమర్శించారు. ప్రజలపై భారం మోపుతూ నాలుగేళ్లలో 9సార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచారన్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం అవినాశ్‌రెడ్డి, విజయసాయిరెడ్డి కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా విద్యుత్ రంగంలో చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. స్మార్ట్‌ మీటర్లు పెద్ద స్కామ్‌ అని, రూ.10వేలు ఖరీదు లేని ఈమీటర్లను రూ.31వేలకు కొనుగోలు చేయడం దారుణమన్నారు. మీ ధన దాహం వల్ల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు కూడా ఊరూరా తిరిగుతూ విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నాలుగేళ్లల్లో 50 వేల‌కోట్లు ప్రజల నుంచి విద్యుత్ రూపంలో ముక్కు పిండి వసూళ్లు చేశారన్నారు. పక్కనున్న రాష్ట్రాల్లో పెరగని విద్యుత్ ఛార్జీలు ఒక్క ఏపీ లోనే ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. ఓ వైపు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా.. అప్రకటిత విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల పైన భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని లేని పక్షంలో అన్ని పార్టీ నాయకులు ప్రజాసంఘాల నాయకులు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయబడతామని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాప్తాడు నియోజకవర్గం ఉపాధ్యక్షులు బి రామాంజనేయులు, ఓబులేసు, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img