Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

వయోవృద్ధులను వేధించడం నిర్లక్ష్యంగా ఉండుట చేయరాదు

రెడ్ క్రాస్ శాశ్వత సభ్యులు డాక్టర్ నరసింహులు
విశాలాంధ్ర – ధర్మవరం : వయోవృద్ధులను వేధించడం నిర్లక్ష్యం చేయడం లాంటిది చేయరాదని, వారిని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రేమను పంచాలని రెడ్ క్రాస్ శాశ్వత సభ్యులు డాక్టర్ నరసింహులు శ్రీ సత్య సాయి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్, శాశ్వత సభ్యులు డాక్టర్ నిర్ధారణ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీ లో గల మధు కంటి వైద్య శాల లో గురువారం ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం వారు నిర్వహించారు. తదుపరి కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం డాక్టర్ నరసింహులు, సత్య నిర్ధారన్,పోలా ప్రభాకర్ మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా వయోవృద్ధులను వేధించడం నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని ఈ సమాచారం బయట ప్రపంచానికి చెప్పలేని, చర్చించబడని సమస్యగా రూపు దాల్చిందని తెలిపారు. వీటిపై నేడు స్వచ్ఛంద సంస్థలు, వృద్ధుల సంఘాలు, రెడ్ క్రాస్ సంస్థ, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ద్వారా చైతన్య పరచడానికి ఈ అవగాహన సదస్సును కూడా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. శారీరక, మానసిక, ఆర్థిక, ఆలక్ష్యం చేయడం, లైంగిక హక్కుల ఉల్లంఘన పద్ధతి ప్రకారం ఇవి వేధింపుల రకాలు కింద వస్తాయని తెలిపారు. తరిగిపోతున్న మానవ, నైతిక విలువలు, కుటుంబ బాంధవ్యాలు కనుమరుగవుతున్నాయని వారు బాధను వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సేవలు చేయడం నేటి యువతరం వారు మర్చిపోవడం చాలా బాధాకరమన్నారు. ప్రస్తుత సమాజంలో ఉద్యోగము, వ్యాపారాలలో, యువత పరిస్థితిని వృద్ధతరం అర్థం చేసుకోలేకపోవడం దారుణమన్నారు. అందుకే ప్రభుత్వం వృద్ధుల సహాయము కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 14567ను ఉపయోగించుకోవాలని వృద్ధులకు తెలియజేశారు. ఈ హెల్ప్ లైన్ ద్వారా వృద్ధులకు కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తారని తెలిపారు. కుటుంబ వ్యవస్థను పటిష్ట పరచడం,ప్రచార సాధనాల ద్వారా యువతకు వృద్ధుల వేధింపు పై అవగాహన పెంచడం, సమాజానికి తగు రీతిలో వృద్ధుల అనుభవాలను సేవలను వినియోగించు కోవడం, తగిన సంఖ్యలో డే కేర్ సెంటర్లు, వృద్ధుల సంఘాలు, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం లాంటివి జరుగుతున్నాయని వారు తెలిపారు. కుటుంబంలో పెద్దదిక్కుగా ఉన్నవారు వృద్ధుల వయసుకు వచ్చినప్పుడు, కేవలం కుటుంబము నుండి ప్రేమాను రాగాలు మాత్రమే ఆశిస్తారని, ఇది కుటుంబ సభ్యులందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. త్వరలో జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ ఉప శాఖలను ఏర్పాటు చేస్తూ వృద్ధులకు న్యాయం జరిగేలా కూడా కృషి చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img