Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

వ్యతిరేక శక్తులను తరిమికొట్టేందుకు సైద్దాంతిక రాజకీయ శిక్షణలు అవసరం….

సిపిఐ పార్టీ బలోపేతానికి సిపిఐ శ్రేణులు విజ్ఞానం పెంపొందించుకోవాలి…

బిజెపి మతోన్మాద ఉన్మాదాన్ని అరికట్టేందుకు సిద్ధం కావాలి…

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విశాలాంధ్ర-గుంతకల్లు : దేశంలో మతోన్మాద ఉన్మాదాలకు పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు లక్ష్యంగా సిపిఐ సైద్దాంతిక రాజకీయ విజ్ఞానం ఎంతో అవసరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. బుధవారం కసాపురం గ్రామంలో శ్రీ వాసవి కళ్యాణ మండపంలో సిపిఐ సైదాంతిక రాజకీయ శిక్షణ తరగతులు సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ శిక్షణ తరగతులకు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ ,సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు, సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ… ప్రపంచ దేశాల్లో కమ్యూనిస్టు సిద్ధాంతాలకు పనిచేస్తున్న ప్రతి ఒక్కరు దేశాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. అందుకు ఉదాహరణ శిక్షణలే సిపిఐ సైద్దాంతిక రాజకీయ శిక్షణ తరగతులని అన్నారు. సిపిఐ పార్టీ బలోపేతానికి సైద్దాంతిక విజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు.ప్రస్తుతం దేశంలో అనేకమైన మత రాజకీయాలతో ముందుకు పోతున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్ద దింపేందుకు ప్రజా శ్రేయస్సును, పేద ప్రజల హక్కులను కాపాడేందుకు రాజకీయ వ్యూహాలు నేర్చుకోవాలన్నారు.ఈ శిక్షణ తరగతుల్లో 32 మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ శిక్షణ తరగతులను ఏర్పాటుచేసిన గుంతకల్లు నాయకులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img