Friday, October 25, 2024
Friday, October 25, 2024

రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణదానం దానం చేసిన వారవుతారు

సాంస్కృతిక మండలి వ్యవస్థాపకులు సత్రశాల ప్రసన్నకుమార్.

విశాలాంధ్ర – ధర్మవరం : రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణదానం అవుతుందని సాంస్కృతిక మండలి వ్యవస్థాపకులు సత్రశాల ప్రసన్నకుమార్, సోలిగాళ్ళ వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాంస్కృతిక మండలి లో శ్రీ చౌడేశ్వరి సేవా సమితి బీ రే శ్రీరాములు, రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చౌడేశ్వరి సేవా సమితి వారు, రక్తదాతలు, పలువురు ప్రముఖులు, ఆసక్తిగల రక్త దాతలు ఈ శిబిరాన్ని విజయవంతం చేశారు. అనంతరం సత్రశాల ప్రసన్నకుమార్, సోలిగాళ్ళ వెంకటేశులు మాట్లాడుతూ ఈ మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. రక్తదాతలు ఇటువంటి సేవా కార్యక్రమములో పాల్గొనడం మానవతా విలువలను పెంచుతాయని తెలిపారు. రక్తదానం ఇచ్చుటదో అపూహలుకు పాల్పడవద్దని, మీరిచ్చే రక్తదానం ఎంతోమందికి పునర్జన్మను ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం రక్తదాన కొరత అధికంగా ఉందని, రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకొని రక్తదానం ఇవ్వటలో ఆసక్తి చూపాలని తెలిపారు. అనంతరం బీరే శ్రీరాములు మాట్లాడుతూ ప్రతి రక్తము ఎంతో విలువైనదని, రక్త దాతలు ఇచ్చే ప్రతి బొట్టు ప్రాణాన్ని నిలబెడుతుందని, ఇప్పటికే చాలాసార్లు రక్తదాన శిబిరమును నిర్వహించడం జరిగిందని, ఇందుకు సహకరించిన వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు వారు తెలియజేశారు, తల సేమియా వ్యాధులకు, గర్భిణీ, బాలింతలకు, ప్రమాదవశాత్తు గాయపడిన వారికి రక్తం ఎంతో అవసరం ఉందని తెలిపారు. 32 మంది రక్తదానాన్ని ఈ శిబిరంలో ఇవ్వడం జరిగిందన్నారు. వీరందరికీ సర్టిఫికెట్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేయడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేతా లోకేష్, బోనాల శివయ్య, పడికేరి నాగరాజు, ఉమ్మడిశెట్టి ప్రసాద్, మేకల శివయ్య, దాసరి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img