టీటీడీ ధర్మకర్త నక్కల వెంకటేశులు
విశాలాంధ్ర – ధర్మవరం:: తిరుమల తిరుపతి దేవస్థానం వారు గత కొన్ని సంవత్సరాలుగా నూతనంగా నిర్మించు దేవాలయాలకు ఎస్టీ, ఎస్టీ, బీసీ ప్రాంతాలకు విగ్రహాలను రాయితీయులపై పంపిణీ చేస్తూ హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా బొమ్మనహళ్లి గ్రామం కళ్ళు దేవరహళ్లి అనే గ్రామంలో గల దేవాలయానికి తిరుమల, తిరుపతి దేవస్థానం వారు చెన్నకేశవ స్వామి, శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలను టీటీడీతరఫున పంపిణీ చేయడం జరిగిందని టీటీడీ ధర్మాచార్యులు నక్కల వెంకటేశులు తెలిపారు. అనంతరం ఆ గ్రామ దేవాలయ కమిటీ టీటీడీ వారికి, నక్కల వెంకటేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.