విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ గిరిజమ్మ, విశ్వేశ్వర రెడ్డి సతీమణి భువనేశ్వరి, యువ నేత ప్రణయ్ రెడ్డి, వైస్ ఎంపిపి వై. శ్రీనాత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరే కాక పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులతో సహా పలువురు నేతలు పాల్గొన్నారు.