Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మిషన్ వాత్సల్య పథకం అర్హత ఉన్నవారికి మన బాధ్యతగా చూడాలి


జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : జిల్లాలో అర్హత కలిగిన వారికి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మిషన్ వాత్సల్య పథకం అందేలా చూడాలని స్పాన్సర్‌షిప్ ప్రోగ్రామ్ కమిటీని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాల్లో మిషన్ వాత్సల్య పథకం సంబంధించి స్పాన్సర్‌షిప్ ప్రోగ్రామ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మిషన్ వాత్సల్య గైడ్లైన్స్ ప్రకారం ఆరు కేటగిరీలలో వచ్చిన అప్లికేషన్లను ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు అర్హత కలిగిన వారిని ఎంపిక చేయాలన్నారు. ఒక బిడ్డ జీవ సంబంధమైన కుటుంబంలో (విస్తృత కుటుంబం మరియు రక్త బంధీకులతో సహా ) అతని/ఆమె విద్యను కొనసాగించేందుకు వీలుగా హాని కలిగించే కుటుంబానికి స్పాన్సర్‌షిప్ నివారణ మరియు పునరావాస మద్దతు, ఉంటుందని తెలిపారు.
తల్లి వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబ విడిచిపెట్టి వెళ్లినా వారి పిల్లలకు పెద్ద కుటుంబంలో నివసిస్తూ పిల్లలు అనాధలుగా ఉన్న వారికి, తల్లితండ్రులు ప్రాణాపాయ/ప్రాణాంతక వ్యాధికి గురైన వారికి, తల్లితండ్రులు అసమర్థులు లేదా పిల్లలను ఆర్థికంగా మరియు శరీరకంగా చూసుకోలేని వారు మరియు భౌతికంగా దూరమైన వారు, జేజే చట్టం, 2015 ప్రకారం సంరక్షణ మరియు రక్షణ అవసరమైన పిల్లలు అంటే ఇల్లు లేకుండా, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన వారు, బాల కార్మికులు, బాల్య వివాహ బాధితులు, పిల్లల అక్రమ రవాణా, హెచ్ఐవి /ఎయిడ్స్ బాధిత పిల్లలు, వికలాంగులు, తప్పిపోయిన లేదా పారిపోయిన పిల్లలు, బాల యాచకులు లేదా వీధిలో నివసిస్తున్న, హింసకు గురైన లేదా దుర్వినియోగం చేయబడిన లేదా దోపిడీకి గురైన పిల్లలు మద్దతు మరియు పునరావాసం అవసరం, 6 పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ స్కీమ్ కింద కవర్ చేయబడిన పిల్లలు స్పాన్సర్‌షిప్ కోసం అర్హులు.
స్పాన్సర్‌షిప్ వ్యవధి : జువైనల్, జస్టిస్ బోర్డ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లేదా చిల్డ్రన్స్ కోర్ట్ ద్వారా లిఖితపూర్వకంగా నమోదు చేయవలసిన కారణాల ఆధారంగా స్పాన్సర్‌షిప్ ను 18 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. స్పాన్సర్‌షిప్ మద్దతు వ్యవధి మిషన్ వాత్సల్య కాలంలో సహా టెర్మినస్ గా ఉంటుంది.
మిషన్ వాత్సల్య పథకం కింద అర్హత కలిగిన పిల్లలకు స్పాన్సర్షిప్ లేదా పోస్టర్ కేర్ లేదా ఆఫ్టర్ కేర్ కోసం ఒక్క చిన్నారికి రూపాయలు 4000/- నెలవారి గ్రాండ్ అందించబడుతుందన్నారు. ఈ ప్రయోజనం కోసం ప్రతి జిల్లాలో స్పాన్సర్షిప్ మరియు పోస్టర్ కేర్ ఫంటిని సమీక్షించడానికి మరియు మంజూరు చేయడానికి స్పాన్సర్షిప్ మరియు పోస్టర్ కేర్ అప్రూవల్ కమిటీ ఉంటుందని, ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, డిడబ్ల్యు అండ్ సిడబ్ల్యూ అండ్ ఈవో  కన్వీనర్ గాను, చైల్డ్ వెల్ఫేర్ చైర్ పర్సన్ కన్వీనర్ గాను, జిల్లా బాలల సంరక్షణ అధికారి సభ్యుడుగా, రక్షణ అధికారి కార్యదర్శిగా, స్పెషల్లైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (ఎస్ ఏ ఏ ) ప్రతినిధి, ఎన్జీవో (ఆర్ డి టి ) ప్రతినిధి సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, కమిటీ సభ్యులు డబ్ల్యు అండ్ సిడబ్ల్యూ అండ్ ఈవో మేడా రామలక్ష్మి, చంద్రకళ, దీప్తి, రసూల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img