Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

కౌంటింగు రోజున …హింసాత్మక ఘటనలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి

జిల్లా ఎస్పీ గౌతమిశాలి
విశాలాంధ్ర – అనంతపురం : జిల్లాలో హింసాత్మక ఘటనలకు తావులేకుండా కౌంటింగు రోజున పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. జిల్లాలోని ఎస్సై, ఆపై స్థాయి అధికారులతో ఎస్పీ గారు తన క్యాంపు కార్యాలయం నుండీ సోమవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం కొనసాగుతోన్న భద్రతా చర్యలను సమీక్షించారు. కౌంటింగు రోజున ఎలాంటి చర్యలు చేపట్టాలో దిశానిర్ధేశం చేశారు. కార్యాచరణ ప్రణాళికలతో జిల్లాలో ఎక్కడా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టాలన్నారు. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రౌడీషీటర్లు, కిరాయి హంతకులు, చెడునడత కల్గిన వారిని, సమస్యలు సృష్టించే ట్రబుల్ మాంగర్స్ ను ఎవర్నీ వదలకుండా ముందస్తు చర్యలులో భాగంగా బౌండోవర్లు చేయించాలన్నారు. ఇదివరకే కేసులు ఉండి ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘర్షణలకు దిగిన వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని ఆదేశించారు. ఫ్యాక్షన్ ప్రభావిత/ సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు పికెట్లు పటిష్టంగా నిర్వహించి ఆయా గ్రామాల్లోని తాజా పరిస్థితులపై సమాచారం సేకరించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్లాగ్ మార్చ్ లు, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, వాహనాల తనిఖీలు, గ్రామసభలు నిర్వహించడం విస్తృతం చేయాలన్నారు. డ్రోన్లు వినియోగించి ఫలితాలు వెల్లడయ్యాక విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలన్నారు. 144 సెక్షన్ తు.చ తప్పకుండా అమలు చేయాలని… ఐదుగురి కంటే మించి గుమిగూడితే ఉల్లంఘనల కింద చట్టపరంగా ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నికల పోటీ అభ్యర్థుల నివాసాలు, పరిసరాలలో భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు సిసికెమేరాల పర్యవేక్షించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img