విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆదేశాలతో అనంతపురం సెబ్ పోలీసులు భారీగా డిఫెన్సు మద్యం పట్టుకున్నారు. సెబ్ అదనపు ఎస్పీ జి.రామకృష్ణ పర్యవేక్షణలో… అనంతపురం సెబ్ సి.ఐ యల్లయ్య వారి సిబ్బందితో కలిసి రాప్తాడు మండల పరిదిలోని పంగలరోడ్డు వద్ద ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన బులగొండ చంద్రమోహన్ వద్ద నుండి 08 డిఫెన్సు మద్యం బాక్సులు సీజ్ చేయడమైనది . మద్యం బాక్సులు నందు 96(750ఎంల్ ) డిఫెన్సు మద్యం బాటిళ్ళు మరియు ఒక కారు ను ను సీజ్ చేయడమైనది. వీటి విలువ సుమారు రూ. 1,52,100 వరకు ఉంటుంది. అనంతపురము పట్టణము లో అధిక ధరలకు విక్రయించడానికి అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డారని సి.ఐ యల్లయ్య తెలిపారు.