Friday, May 17, 2024
Friday, May 17, 2024

ఇండియా కూటమిలో వృద్ధులకు ప్రతినెలా రూ.4 వేలు పెన్షన్ అందజేత

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి జగదీష్

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఇండియా కూటమి ఆధ్వర్యంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అభ్యర్థులను బలపరిచే దిశగా ఎన్నికలు దగ్గర పడడంతో ప్రచారం ఊపందుకుంది. పట్టణంలో పలు ప్రాంతాల్లో అభ్యర్థితో పాటు సిపిఐ, కాంగ్రెస్ నాయకులు ఇతర ప్రాంతాల్లో సిపిఐ, కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. గురువారం స్థానిక రామచంద్ర నగర్, ఎర్ర నేల కొట్టాల, రెవెన్యూ కాలనీ , ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో సిపిఐ అనంత అభ్యర్థి సీ. జాఫర్ తో పాటు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ… వృద్ధులకు, వితంతువులకు ప్రతి నెల రూ.4 వేలు, దివ్యాంగులకు ప్రతినెల రూ.6 వేలు అందజేస్తామన్నారు. మన అభ్యర్థి జాఫర్ సమస్యలపై పోరాడి సాధించే గల వ్యక్తి అని పేర్కొన్నారు. అనంత పట్టణ అభివృద్ధి చెందాలంటే ఒక సిపిఐ పార్టీకే సాధ్యమన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులైన అనంత కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వి. మల్లికార్జున తమ ఓటు హస్తం గుర్తుకు వేసి బలపరచాలన్నారు. కంకి కొడవలి గుర్తు అయినటువంటి సిపిఐ అనంత అర్బన్ అభ్యర్థి జాఫర్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో అనంతపురం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, మల్లికార్జున, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరాములు లింగమయ్య కేశవరెడ్డి రామకృష్ణ కత్తి నారాయణస్వామి రమణ సంతోష్ కుమార్ ఏఐవైఎఫ్, జిల్లా కార్యదర్శి రాజేష్ ఏఐటీయూసీ,జిల్లా అధ్యక్షుడు నాగరాజు ఏఐఎస్ఎఫ్, జిల్లా కార్యదర్శి కుల్లాయిస్వామి సిపిఐ నగర సహాయ కార్యదర్శి అల్లిపిరా ఏఐటీయూసీ నగర అధ్యక్ష కార్యదర్శులు చిరంజీవి కృష్ణుడు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రమణయ్య సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు సమితి సభ్యులు రాప్తాడు సింగనమల నాయకులు ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు కె.రాము,చాంద్ ,శ్రీకాంత్,షకీల్ ఆనంద్, రాజేష్ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు మంజునాథ్ నాయకులు వంశీ నరసింహ హరికృష్ణ మైనార్టీ సిపిఐ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్ కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img