Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

సచివాలయ ఉద్యోగులు ప్రజలకు సంక్షేమ పథకాలను అందేలా కృషి చేయాలి

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా సచివాలయ ఉద్యోగులు తమ విధులను చక్కగా నిర్వర్తించాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం మండల పరిధిలోని రావులచెరువు గ్రామంలో గడప గడపకు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరి వెంట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ. ప్రతాపరెడ్డి తోపాటు నాయకులు ఉన్నారు. తదుపరి 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. తదుపరి సచివాలయ ఉద్యోగులతో గదులను వారు ప్రారంభింప చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటా తిరుగుతూ ప్రజల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు గూర్చి ఆరా తీస్తూ.. అందుతున్నాయా? లేదా? అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమస్యలను పరిష్కరించేందుకే తాను గడపగడప అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని, ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను తెలుసుకోవచ్చు అని తెలిపారు. గ్రామములో ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరిందని వైద్య సిబ్బంది తెలుపగా మరమ్మత్తుకు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సౌజన్య కుమారిని ఆదేశించారు. తదుపరి విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయే దశలో ఉన్నాయని, నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా, నూతన స్తంభాల ఏర్పాటును వెంటనే నిర్వహించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. సచివాలయ ఉద్యోగులు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను అంగన్వాడీ కేంద్రాలను వారు ఉపాధ్యాయులు అందరూ ఉన్నారా? ఏమైనా కొరత ఉందా? అని ఎంఈఓ గోపాల్ నాయక్ అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రాలలో పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా అందించాలని అంగన్వాడి టీచర్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ హైమావతి, వైస్ ఎంపీపీ. చిన్న కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ నులకరామయ్య, తహసిల్దార్. యుగేశ్వరి దేవి, ఎంపీడీవో. సౌజన్యకుమారి, సంగాలప్ప, రవీంద్రారెడ్డి, పరంధామారెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ సంగం అధ్యక్షులు నాగానంద రెడ్డి తోపాటు రావులచెరువు, ఎర్రగుంటపల్లి, తిప్పేపల్లి గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img