Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

సాఫ్ట్ బాల్ పోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి

విశాలాంధ్ర-రాప్తాడు : అంతర్జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల్లో రాణించేందుకు చక్కటి తర్ఫీదు తీసుకుని ముందుకు సాగాలని రైపర్ కళాశాల కరస్పాండెంట్ రాఘవేంద్ర రెడ్డి సూచించారు. గత నెలలో గుజరాత్ లో జరిగిన జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల్లో అనంతపురం నగరానికి చెందిన మహేష్ పాల్గొని ఉత్తమ ప్రతిభ చాటి పతకాలను సాధించాడు. సాఫ్టుబాల్ ఆటగాడు మహేష్ కు రైపర్ కరస్పాండెంట్ రాఘవేంద్రరెడ్డి శనివారం రూ.5వేలు నగదు అందజేసి సత్కరించారు. మహేష్ మాట్లాడుతూ తాను జాతీయ స్థాయి ఆటగాడిగా ఎదిగానంటే సాఫ్టుబాల్ ఏపీ సీఈఓ సి.వెంకటేసులు సహకారం మరువలేనిదని కొనియాడారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సలీంబాషా, పీడీ ఓంకారేశ్వర్, ఏఓ ఉమామహేశ్వరరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img