విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ఎర్రగుంటలో వాటర్ ప్లాంట్ పక్కన గుర్తు తెలియని ఓ వృద్ధ మహిళ మృతి చెందింది. అక్కడ ఉన్న స్థానికులు వన్ టౌన్ ఏఎస్ఐ కేతన్నకు సమాచారాన్ని అందించారు. దీంతో కేతన్న సీఐ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు అక్కడకు చేరుకొని మహిళ మృతి చెందిన విషయాన్ని వారు ధ్రువీకరించుకొని, స్వచ్ఛంద సేవా సంస్థ అయిన శ్రీకృష్ణ చైతన్య భక్త భజన మండలి వారికి ఫోన్ ద్వారా సమాచారా అందించారు. కమిటీ వారు హుటాహుటిన వైకుంఠ రథాన్ని పంపించి, మృతదేహానికి అంత్యక్రియలను వారు నిర్వహించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం, ఏఎస్ఐ కేతన్న భక్త భజన మండలి వారికి కృతజ్ఞతలను తెలియజేశారు.