London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

పామిడి లో పొంగిపొరలుతున్న వాగులు, వంకలు

విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : పామిడి మండలం పరిధిలో మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది. వర్షాలకు అనేక రహదారులు జలమయమయ్యాయి. ఫలితంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కాలువలు ఉద్ధృతంగా ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఎద్దులపల్లి పాల్యం గ్రామంలో వాగు దాటుతుండగా నీటి ఉద్ధృతికి ఒక వ్యక్తి కొట్టుకుపోయారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది గ్రామస్థులు వ్యక్తిని రక్షించారు. రామగిరి చెరువు గట్టు తెగిపోవడంతో పలు గ్రామాలుజలమయమయ్యాయి. అనుంపల్లి చెరువు నిండడంతో భారీగా వర్షపు నీరు పారడంతో అనుంపల్లి, ఖాదర్ పేట గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.అలాగే జి.కొట్టాల, కాలాపురం, కొండాపురం, గ్రామం వద్ద రోడ్డు పైనే వంకలు పొంగిపొర్లుతున్నాయి పామిడి పట్టణ పరిధిలోని పలు వార్డు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు…..

చెరువులను తలపిస్తున్న కాలనీలు…….వీకే ఆది రెడ్డి కాలనీ, వెంగమా నాయుడు కాలనీ, చైతన్య కాలనీ, బీసీ కాలనీ, వర్షపు నీరంతా వీధుల్లోనే నిల్వ ఉండటంతో చెరువును తలపిస్తోంది. 44వ నంబరు జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ కాలనీలలో సరైన రోడ్లు, డ్రైనేజీలు లేవు. దీంతో వర్షాకాలం వచ్చిందంటే వర్షపు నీరం తా వీధుల్లోనే నిల్వ ఉంటోంది. గత కొన్ని రోజు లుగా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని ప్రధాన వీధులని వర్షపు నీటితో నిండిపోయాయి.

సహాయక చర్యల్లో టిడిపి నాయకులు…..గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పట్టణంలోకి వస్తున్న వర్షపునీటి తాకిడికి కాలువల్లో అడ్డు ఉన్నా చెత్తాచెదారం దీంతో పామిడిలో నెలకొన్న కాలువల దుస్థితి దృష్ట్యా కాలువల్లో చెత్తను తొలగించాలని తెదేపా నాయకులు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచనలతో టిడిపి పామిడి ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆదేశాలతో పట్టణంలో వార్డుల్లోని జలదిగ్బంధంలో చిక్కుకున్న వారికి అల్పాహారం అందించారు. కాలువల్లో అడ్డుగా ఉన్న చెత్తను తొలగించే దిశగా గ్రామపంచాయతీ అధికారులు, తెదేపా నాయకులు అర్ అర్ రమేష్ 5 జేసీబీ 1 హిటచి తో చర్యలు చేపట్టడం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img