Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

పరీక్షల కోసం పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : తాడేపల్లిలోని విద్యా శాఖ కార్యాలయం నుంచి గురువారం ఇంటర్మీడియట్, 10వ తరగతి, డీఎస్సి, టెట్ పరీక్షలపై జిల్లా కలెక్టర్ లతో స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమీషనర్ సౌరబ్ గౌర్, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తో కలిసి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు.
అనంతపురం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డివిఈఓ వెంకటరమణ నాయక్, డిఈఓ వరలక్ష్మి, ఇన్స్పెక్టర్ రాముడు, తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ఇంటర్మీడియట్, 10వ తరగతి, డీఎస్సి, టెట్ పరీక్షల నిర్వహణ కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్ పరీక్షలకు, మార్చి 18వ తేదీ నుంచి నిర్వహించే పదవ తరగతి పరీక్షల కోసం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి పరీక్షలను తనిఖీ చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా జరగాలని, ఫ్యాన్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సులతో రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్షలు జరిగే రోజు 100 మీటర్లలోపు ఉండే జిరాక్స్ సెంటర్లను బంద్ చేయించాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటు ఒక నర్సును ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అప్రమత్తంగా ఉంటూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాలను సెల్ ఫోన్ ఫ్రీ జోన్ గా ప్రకటించడం జరిగిందని, కావున ఏ సిబ్బంది కూడా సెల్ ఫోన్ లను ఉపయోగించరాదన్నారు. పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందు అమ్మాయిలను మహిళా పోలీసులు తనిఖీ చేయాలన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img