Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో గట్టి చర్యలు చేపట్టాలి

ఎస్పీ పక్కీరప్ప కాగినెల్లి

విశాలాంధ్ర- రాప్తాడు : శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని ఎస్పీ పక్కీరప్ప సూచించారు. బుధవారం రాప్తాడు పోలీసు స్టేషనును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లోని తాజా పరిస్థితులపై ఆరా తీశారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల కట్టడికి కృషి చేయాలన్నారు. తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఇతర విభాగాలతో కలసి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు చేపట్టి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన విస్తృత కల్పించాలన్నారు. క్రైం అగనెస్ట్ ఉమెన్, ఎస్సీ ఎస్టీల నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. ప్రజల్లో మమేకమయ్యేలా పోలీసుల పని తీరు ఉండాలని సూచించారు. గ్రామ పోలీసులను సమన్వయం చేసుకుని నేరాలు తీవ్రం కాకుండా మొగ్గ దశలోనే అణచి వేయాలన్నారు. అనంతరం పోలీసు స్టేషన్ సిబ్బందితో ముఖాముఖి సమావేశమై సిబ్బంది సాధక బాధకాలను అడిగి తెలుసుకోవడంతో పాటు పోలీసు విధుల పట్ల దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో ఇటుకలపల్లి సి.ఐ మోహన్, రాప్తాడు ఎస్సై రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img