Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

మాస్ కాఫీ పాల్పడుతున్న కోఆర్డినేటర్లపై చర్యలు తీసుకోండి

ఏఐఎస్ఎఫ్ నాయకులు


విశాలాంధ్ర ధర్మవరం:: ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాఫీ కు పాల్పడుతున్న కోఆర్డినేటర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఆర్డిఓ కార్యాలయంలోని డిఏఓ ఖతిజున్ కుప్రాకు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు జగదీష్ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్, పరీక్షలలో మాస్ కాఫీ ని అరికట్టాలని, పరీక్షకు ఎటువంటి ప్రభుత్వ నిబంధన లేకుండా ఇచ్చుకో, చూసుకో, రాసుకో అనే విధంగా విచ్చలవిడిగా మాస్ కాపీ జరిపించి, వేలాది రూపాయలకు అమ్ముడు పోతున్నారు అన్నారు. పరీక్షలు నిర్వహించే చీఫ్ ఆఫీసర్ కోఆర్డినేటర్లతో కుమ్మక్కయి విచ్చలు విడిగా మాస్ కాఫింగు పాల్పడుతుడం దారుణమన్నారు. కాబట్టి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలనీ, ఎటువంటి ప్రభుత్వం నిబంధనలు పాటించనీ పరీక్షల విభాగం చీఫ్ ఆఫీసర్ కోఆర్డినేటర్ల పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఉపాధ్యక్షులు సూర్యతేజ, పట్టణ నాయకులు ఆకాష్, నవీన్, సురేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img