Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

ఎన్నికల విధులు సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టండి

రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం:: ఎన్నికల విధులు సజావుగా నిర్వహించేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలో ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రొసీడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్లకు ఎన్నికల విధివిధానాలలో చేపట్టాల్సిన పద్ధతులపై శిక్షణా తరగతులను పట్టణములోని శ్రీ సాయిబాబా కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ నియోజకవర్గ ఎన్నికలకు గాను స్థానిక నియోజకవర్గంలోని అధికారులు, ఇతర నియోజకవర్గంలోని అధికారులు కూడా శిక్షణలో పాల్గొన్నారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులు మే 4వ తేదీ, ఆరవ తేదీలలో కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా పలు విషయాలను పిఓ, ఏపిఓలకు తెలియజేశా రు. ఎన్నికల విధులలో అధికారులు అప్రమత్తంతోపాటు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వరాదని, సజావుగా విజయవంతంగా ఎన్నికలు నిర్వహించేలా తమ విధులను బాధ్యతతో చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో భాగంగా ఓటరు తన ఓటును వేసుకునేందుకు, ఏదైనా అనుమానాలు వస్తే ఆ అనుమానాలను కూడా నివృత్తి చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఓటర్ కార్డు కలిగివున్న ప్రతి ఓటరు తప్పక ఓటును సద్వినియోగం చేసుకునేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. తదుపరి పిఓ లకు, ఏపీఓలకు వచ్చిన అనుమానాలను వెంకట శివరామిరెడ్డి స్వయంగా నివృత్తి చేశారు. అదేవిధంగా పట్టణంలోని సాయి కృప జూనియర్ కాలేజీలో ఎన్నికల విధులలో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్లు సద్వినియోగం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని, పోస్టల్ బ్యాలెట్ ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది అని తెలిపా రు. ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఈనెల 4వ తేదీతో పాటు ఆరవ తేదీ కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్, తాసిల్దార్ రమేష్, సహాయ ఎన్నికల ఉప తాసిల్దార్ షణ్ముఖ యాదవ్, పిఓలు ఏపీవోలు 342 మంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img