*కృతజ్ఞత తెలిపిన మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్
విశాలాంధ్ర – అనంతపురం : సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఆరు ఎకరాలకు పైగా మెడికల్ కళాశాలకు చెందిన స్థలాన్ని ఎవరు ఆక్రమించకుండా అది మెడికల్ కళాశాలకు చెందిన స్థలంగా ప్రహరీ గోడ కట్టుకునేందుకు అనుమతులు రావడానికి సహకరించిన స్థానిక ఎంపీ శ్రీ అంబిక లక్ష్మీనారాయణ కి, స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కి, అనంత జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీ డాక్టర్ వినోద్ కుమార్ కి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె ఎస్ ఎస్ వేంకటేశ్వర రావు కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్ కళాశాల క్రీడా మైదానంగా దానిని అభివృద్ధి చేయడానికి కూడా తమ వంతు సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ముందుగా ఇతరులు ఎవరు ఆ స్థలాన్ని ఆక్రమించకుండా ప్రహరీ గోడ నిర్మించుకోవాలని సూచించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ తన సిబ్బందితో కలిసి స్థానిక ఎంపీ ,ఎమ్మెల్యే, కలెక్టర్ లకు పుష్పగుచ్చాలు అందించి కృతజ్ఞతలు తెలియజేశారు.గతం లో కూడా ఇదే విషయమై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ లను కలవడం జరిగిందని, ప్రిన్సిపాల్ సూపరింటెండెంట్ తెలిపారు. మెడికల్ కళాశాలకు క్రీడా ప్రాంగణాన్ని తీసుకురావడంలో కృషి చేసిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు కు, సూపరింటెండెంట్ డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావుకు మెడికల్ కళాశాల సిబ్బంది, వైద్య విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, హౌస్ సర్జన్లు కృతజ్ఞతలు తెలిపారు.