Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

21వ అఖిలభారత పశుగణన కార్యక్రమం సకాలంలో పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం అనంతపురం జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి తెలిపారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 21 వ అఖిలభారత పశు గణనకు సంబంధించిన గోడపత్రాలు, బ్రోచర్లు, స్టిక్కర్లు, సూచన పుస్తకాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..  భారత దేశమంతా 21వ అఖిలభారత పశుగణన, ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమం అక్టోబర్ 25 నుంచి 2025 ఫిబ్రవరి 28 తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలన్నారు. జిల్లాలో 6.20 లక్షల కుటుంబాలు ఉన్నట్లు అంచనా వేశామన్నారు. పట్టణ ప్రాంతాలలో 3వేల ఇండ్లకు, గ్రామీణ ప్రాంతాలలో 2వేల ఇండ్లకు ఒక ఇనుమేరేటర్ను నియమించడం జరిగిందని, జిల్లాలోని 31 మండలాలలో 493 పల్లెలలోని ప్రతి కుటుంబాన్ని సందర్శించి పశుగణన చేపట్టేందుకు అధికారులు సిబ్బంది అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పశు గణనలో భాగంగా గణన ప్రక్రియ పూర్తయినట్లు చిహ్నంగా ప్రతి ఇంటి ముందు తలుపు కుడి ఎగువ మూలలో స్టిక్కర్లు అతికించాలని తెలిపారు. ఈ పశుగణన ద్వారా పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలతోపాటు వివిధ రకాల కోళ్ళు పక్షులతో సహా 16 రకాల పెంపుడు జంతువులపై జాతుల వారీగా సమాచారాన్ని సేకరిస్తారన్నారు. ఈ గణన ప్రక్రియ పశు సంవర్దక రంగంపై ఆధారపడిన కుటుంబాల జీవనోపాధికి తోడ్పడేలా కార్యక్రమాల రూపకల్పనకు ఉపకరిసస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జెడి వెంకటస్వామి, డిడి రమేష్ రెడ్డి, ఏడీలు శ్రీలక్ష్మి రాధిక, వి.ఎల్. ఓ రంగారెడ్డి, పశు సంవర్ధకశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img