Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రాథమిక హక్కులను కాలు రాస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

. సమస్యలను పై పోరాడే విలేకరుల పై దాడి చేయడం సిగ్గుచేటు…
. సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ప్రాథమిక హక్కులను కాలు రాస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ పిలుపునిచ్చారు. గురువారం ఏపీయూడబ్ల్యూజే చలో అనంతపూర్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సంగమేశ్వర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వద్ద సదస్సు కేంద్రానికి ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ వి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందూ జనార్ధన్, కార్యదర్శి రామ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ… పత్రికలపై గుండాలను రెచ్చగొడుతున్న సీఎం వైఖరి సరేంది కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా నిష్ప పక్షపాతంగా పరిపాలన చేస్తానని, ప్రాథమిక హక్కులను కాపాడుతానని ప్రమాణం చేసిన వ్యక్తి వాటికి విరుద్ధంగా పరిపాలన చేయడం సిగ్గుచేటు అన్నారు. నాలుగు సంవత్సరాల పది నెలల కాలం వరకు ప్రశ్నించే ప్రతిపక్షాల పార్టీలు, పత్రికల పైన దాడులు చేయడం పట్ల వ్యతిరేకిస్తున్నామన్నారు. పక్షాలను విమర్శించడం కాదు స్వయానా నీ చెల్లెలే షర్మిల నీ మీద తిరగబడుతోందన్నారు. జర్నలిస్టు కృష్ణ పైన దాడి చేసిన వారిలో రాప్తాడు కు చెందిన బండి రవి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అప్పజెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాన్ని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కాలరాస్తున్నాడన్నారు. ఒక వైద్యుడు తన వృత్తిపరంగా మంచి వైద్యాన్ని అందిస్తున్నాడని, ఒక ఉపాధ్యాయుడు సమాజానికి దిశ నిర్దేశం చేస్తున్నాడన్నారు. జిల్లా, పట్టణ, గ్రామీణ స్థాయిలో సమస్యల ను వెలుగులోకి తీసుకొస్తున్న విలేకరులపై దాడి చేయడం దుర్మార్గంపు చర్య అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున,కార్యవర్గ సభ్యులు శ్రీరాములు,నారాయణస్వామి, సంతోష్ కుమార్, రాజేష్ గౌడ్ కుళాయి స్వామి, టిడిపి, సిపిఐ, సిపిఎం, జనసేన, ఇతర ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు, రాయలసీమ వ్యాప్తంగా వందలాదిమంది జర్నలిస్టు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img