Friday, June 14, 2024
Friday, June 14, 2024

స్ట్రాంగ్ రూములో మూడం చల భద్రత ఏర్పాటు కలదు

ఆర్డీవో, రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : ఈనెల 13వ తేదీన ధర్మవరం నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికలు హిందూపురం పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించడం జరిగిందని, వీటికి సంబంధించిన ఓటింగ్ మిషన్, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లను, వివి ప్యాట్లను, లేపాక్షి మండలం చోళ సముద్రం, నాయన పల్లి క్రాస్ వద్దగల డాక్టర్ అంబేద్కర్ గురుకులం స్కూల్లో భద్రపరచడం జరిగిందని, ఇక్కడ మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్డీవో రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక్కడ వరకే అనుమతి ఉండేదని తెలిపారు. ప్రస్తుతం జూన్ 4వ తేదీన లెక్కింపు చేయు వరకు స్ట్రాంగ్ రూమ్ వరకు వెళ్లి ఏర్పాటు చేయబడిన భద్రతా విషయములను పరిశీలన చేసుకొనుటకు మూడంచెల భద్రత ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందుకు జిల్లా కలెక్టర్ వారి అనుమతి కూడా లభించిందని తెలిపారు. అభ్యర్థులు లేదా వారి తరఫున ఏజెంట్ గాని స్ట్రాంగ్ రూమ్ పరిశీలన కొరకు ఉదయం 10 గంటల నుండి 11 గంటల మధ్య లేదా మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్య స్ట్రాంగ్ రూమ్ పరిశీలన చేసుకొని తెలిపారు. అనుమతి లేనిదే ఎవరిని కూడా ప్రవేశింప చేయమని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img