Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాధనాల పట్ల విద్యార్థి దశ నుండే అవగాహన కల్గి ఉండాలి

— జిల్లా ఎస్పీ పి.జగదీష్
విశాలాంధ్ర అనంతపురం : పోలీసు విధుల్లో వినియోగించే ఆయుధాలు, సాధనాల పట్ల విద్యార్థి దశ నుండే అవగాహన కల్గి ఉండటం మంచిదని జిల్లా ఎస్పీ పి.జగదీష్ అభిప్రాయపడ్డారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని షాదీఖానాలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు తమ దైనందిన విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, పరికరాలు, సాధనాలను ప్రదర్శనలో ఉంచారు. సుశిక్షుతులైన సిబ్బందిచే సందర్శనకు విచ్చేసిన ప్రజలకు ఆయుధాల గురించి అవగాహన చేశారు. సందర్భంలో ఎలాంటి ఆయుధాన్ని వినియోగిస్తారు, వాటి పని తీరు గురించి ఈసందర్భంగా విద్యార్థులకు జిల్లా ఎస్పీ అవగాహన కల్పించారు. 22 రైఫిల్ , .410 మస్కెట్ , .303 రైఫిల్ , 762 ఎం.ఎం ఎస్ ఎల్ arఏ.కే 47, 5.56 ఎం.ఎం (ఇన్సాస్ ), 9 ఎం.ఎం. కార్బైన్ , .38 రివాల్వర్ , 9 ఎం.ఎం ఫిస్టోల్ , 9 ఎం.ఎం గ్లాక్ , వి.ఎల్ ఫిస్టోల్ , ప్రొజెక్టర్ ఫైరోటెక్ , 12 బోర్ పంప్ యాక్సన్ గన్ , ఎల్ .ఎం.జి, 51 ఎం.ఎం మోటారు, హెచ్ .ఇ 36 గ్రనేడ్ , యాంటీ రైట్ గన్స్ , గ్యాస్ గన్ , రోబోటెక్ ( బాడీ ప్రొటెక్టర్ ) , సేవాదళ్ డ్రస్ , ఫైబర్ లాఠీ, బాడీ ప్రొటెక్టర్ , స్టోన్ గార్డు, హెల్మెట్ , కేన్ లాఠీ, బుల్లెట్ ప్రూప్ జాకెట్ హెవీ, మీడియం, లైట్ … డే మరియు నైట్ విజన్ బైనాక్యూలర్లు, జి.పి.ఎస్ , మెగాఫోన్ , లెటర్ బాంబు డిటెక్టర్ , డి.ఎస్ .ఎం.డి, హెచ్ హెచ్ ఎం డి, ఎన్ ఎల్ జె డి నార్కో డిటెక్సన్ కిట్ , పాలిరే యు.వి.లైట్ , క్లూస్ టీం, డస్ట్ ఫుట్ ప్రింట్ లిఫ్టర్ , ఎల్ హెచ్ ఎం ఎస్ , బాడీవోన్ కెమేరాలు, ఫిన్స్ ( ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్ వర్కింగ్ సిస్టం) , డ్రోన్ కెమేరాలు, డి.ఎఫ్ .ఐ.డి, బాంబు రింగ్, వాటర్ కేనన్ , వజ్ర వాహనాలు మరియు డాగ్ బృందాలను ప్రదర్శనలో ఉంచారు.ఈకార్యక్రమంలో అనంతపురం డీఎస్పీ వి.శ్రీనివాసరావు, త్రీటౌన్ సి.ఐ శాంతిలాల్ , ఆర్ ఐ లు రెడ్డెప్పరెడ్డి, రాముడు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్ , ఆనంద్, పలువురు ఆర్ ఎస్ ఐ లు, పోలీసు సిబ్బంది మరియు నగరంలోని పలు విద్యాసంస్థలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img