Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

రెవెన్యూ అధికారుల అండతో వీఆర్ఏ మోసాలు

బట్టబయలు చేసిన లబ్ధిదారులు
విశాలాంధ్ర- శింగనమల : మండల పరిధిలోని శివపురం గ్రామం చక్రాయపేట గ్రామ పొలం సర్వేనెంబర్ 531 లో రెండు ఎకరాల 17 సెంట్లు భూమి కలదు, ఈ భూమి శివపురం గ్రామానికి చెందిన తలారి తిరుపాలు కు సంబంధించిన భూమి, అయితే ఈ భూమిని శివపురం గ్రామానికి చెందిన 17 మంది వారికి కావాల్సినంత ఒక్కొక్కరు నాలుగు,ఐదు, ఆరు,ఏడు, సెంట్లుభూమిని కొనుక్కొని అగ్రిమెంట్ చేయించుకుని ప్రభుత్వ పక్కా గృహాలు కూడా నిర్మించుకున్నారు, ఇలాంటి భూమిని రెవెన్యూ అధికారుల అండదండలతో బండమీద పల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ ఓబుల పతి అదును చూసి భార్య మన్నేపాకుల లక్ష్మి పేరు మీద సర్వేనెంబర్ 531 ఒకటో లెటర్ లో రెండు ఎకరాల 17 సెంట్లు అందులో స్మశానం కూడా వదలకుండాపట్టా పాసుబుక్కులు చేయించుకొని బ్యాంకులో రుణం పొంది అర్హులైన లబ్ధిదారులను మోసం చేసిన ఘనుడు వీఆర్ఏ ఓబుల్ పతి మమ్మల్నితీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, శివపురం దళితులు శుక్రవారం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు, గత రెండు సంవత్సరముల నుండి ఈ విషయమైస్థానిక తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లిన నూ మాకు ఇంతవరకు న్యాయం జరగలేదని, దళితులు వాపోతున్నారు, మా ఇళ్లను స్థలాలను అక్రమంగా పట్టా చేయించుకున్న వీఆర్ఏ ఓబులపతి మీరేం చేసుకుంటారో చేసుకోపో అని మా మీదికి వస్తున్నాడనిఇప్పటికైనా అధికారులు వీఆర్ఏ ఓబులపతిని సస్పెండ్ చేసితగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు, ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు నారాయణస్వామి, సన్నాగప్ప చంద్ర, చిన్న ఎర్రప్ప, శివయ్య, నగేష్, రామంజి, బాల నాగన్న, కిష్టయ్య,రామాంజనేయులు, బాలకుల్లాయప్ప, చిన్న పెద్దన్న, ఏర్నాగప్ప, చిన్న నల్లప్ప, పెద్దన్న, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img