Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

బడుగు బలహీన వర్గాలకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో రుణపడి ఉంటాం

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ నందు బుధవారం వంశిక ఫంక్షన్ హాల్ నందు నూతనంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి మంగమ్మ ఏకగ్రీవం కావడంతో ఎమ్మెల్సీగా ఎన్నికై నందున ఆమెకు పెనుకొండ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు నాయకులు అభినందన సభ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు మాల గుండ్ల శంకర్ నారాయణ జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని అభినందన సభలో మాట్లాడారు ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగంన్ని రచించిన అంబేద్కర్ కూడా కలలుకని ఉండడని బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ని పదవులు ఇస్తారని రాజ్యాధికారాన్ని బడుగు వర్గాలకు అందజేస్తాడని అలాగే అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారాన్ని కల్పించే విధానంలో జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా స్థానిక సంస్థలలోనూ మరియు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ ఎంపీ స్థానాలలోనూ అన్ని వర్గాలకు ప్రాతినిత్యం వచ్చే విధంగా చూస్తున్నాడని ఇటువంటి ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకులు ఓర్చలేక లేనిపోని నిందారోపణలు చేస్తున్నారని ఎవరు ఎన్ని పలికిన ప్రజల మనసులో గుండెలలో జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా ఉన్నాడని ఆయన తెలిపారు అలాగే గిరిజమ్మ మాట్లాడుతూ బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదని బ్యాక్ బోన్ గా రాజ్యాధికారానికి ఉండాలని ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు అత్యున్నత పదవులు ఇస్తున్నాడని తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని మంగమ్మ ఎన్నో ఏళ్ల క్రితం నుంచి వారి కుటుంబం జగన్మోహన్ రెడ్డికి విధేయత గా ఉండడం వల్లనే ఈరోజు పిలిచి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం ముఖ్యమంత్రి యొక్క దూర దృష్టికి నిదర్శనమని బీసీలు ఎల్లప్పుడూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని ఆమె తెలిపారు ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో బీసీలలో అత్యధికంగా ఉన్న బోయ కులస్తులను గుర్తించి స్థానిక సంస్థ ఎన్నికలలో కర్నూలు జిల్లాలో ఒకరికి అనంతపురం జిల్లాలో ఒకరికి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టికెట్ కేటాయించడం శుభపరిణామం అని ఆమె తెలిపారు సన్మాన గ్రహీత మంగమ్మ మాట్లాడుతూ మా కుటుంబాన్ని గుర్తుంచుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు స్థానిక సంస్థల ప్రాతనిత్యం కింద ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం తో వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని మా భర్త గంగాధర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మూడుసార్లు ఎంపీగా ఎన్నికై తెలుగుదేశం పార్టీ వారు పెట్టిన ఇబ్బందుల వలన అనేక ఇబ్బందులకు గురయ్యామని వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత మమ్మల్ని గుర్తించి పార్టీ బాధ్యతలు అప్పజెప్పి నియోజకవర్గమంతా ఇన్చార్జిగా పని చేశానని మరల కాలానుగుణంగా ఇతరులను ఇంచార్జి నియమించడం వలన పార్టీ కోసమే కష్టపడి పని చేశానని ఇప్పుడు నన్ను గుర్తించుకొని ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం వలన బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారని ఆమె తెలిపారు అనంతరం చాలామంది వక్తలు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నుంచి ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు అనంతరం ఆమెను ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img