Friday, April 26, 2024
Friday, April 26, 2024

అక్రమంగా చేపలు పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి : సీపీఐ

విశాలాంధ్ర ఆస్పరి : మండల పరిధిలోని వెంగలాయదొడ్డి చెరువులో అక్రమంగా చేపలను పడుతున్న అక్రమార్కుల పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు నాగేంద్రయ్య, మండల కార్యదర్శి విరుపాక్షి లు డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మన్న కు అలాగే పోలీస్ స్టేషన్ లో ఎస్సై వరప్రసాద్ లకు వేరువేరుగా వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంగళయదొడ్డి చెరువులోకి స్వచ్ఛందంగా వర్షపు నీటిలో కొట్టుకు వచ్చిన చేపల పై కొంతమంది అక్రమార్కులు చెరువులో చేపలను పడుతూ విక్రయాలు జరుపుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అక్రమ చేపల వేటగాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలో చెరువు ఆయకట్టు రైతులుతో కలిసి సిపిఐ బృందం వెంగళాయదొడ్డి చెరువును పరిశీలించి, అక్రమంగా చేపలు పడుతున్న వేటగాళ్ల భరతం పడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు బ్రహ్మయ్య, పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, ఉరుకుందప్ప, రంగన్న, బజారి, మల్లికార్జున, వీరన్న, మల్లన్న, ఏఐవైఎఫ్ నాయకులు రామాంజనేయులు, చదువుల రామయ్య, అంజినయ్య, హరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img