విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహానికి శనివారం జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు నితిన్ అగర్వాల్ ఐ.ఆర్.ఎస్, రాందాస్ టి.కాలే లు చేరుకున్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.