Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

విశాలాంధ్ర-రాప్తాడు : ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు తాసిల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. వారంలో రద్దు చేస్తామన్న సీపీఎస్ హామీ నాలుగేళ్లయినా అమలు చేయకపోవడం అత్యంత బాధాకరమన్నారు. 11వ వేతన సవరణలోని అసంగతాలను తొలగించాలన్నారు. 12వ వేతన సంఘాన్ని నియమించాలన్నారు. పెండింగులో ఉన్న తక్షణమే మంజూరు చేయాలన్నారు. ప్రతినెలా ఒకటో తారీఖున జీతాలు చెల్లించకపోవడం వల్ల తమ కుటుంబ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పని సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయులను 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు మార్చడం బాధాకరమన్నారు. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని, మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలల్లో విలీనాన్ని రద్దు చేయాలన్నారు. అనంతరం  తహశీల్దార్ లక్ష్మీనరసింహకు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో ఏపీటీఎచీఫ్ మండల అధ్యక్షులు యస్ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి వి.బాలకదిరప్ప, వెంకటరాముడు, ఆంజనేయులు, ఆదినారాయణ రెడ్డి నర్సింహులు, రామక్రిష్ణ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img