Friday, May 3, 2024
Friday, May 3, 2024

రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

విశాలాంధ్ర-తాడిపత్రి : పట్టణంలోని మార్కెట్ యార్డులో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర పనుల కోసం వచ్చిన వాహనదారులకు, వాహన చోదకులకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాసులు, రాజగోపాల్ కు రహదారి భద్రత ప్రమాదాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్లపై వెళ్లే సమయాలలో అధిక వేగంతో వెళ్ళరాదు అన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదన్నారు. త్రిబుల్ రైడింగ్ చేయరాదన్నారు. వాహనం నడిపే సమయంలో తమ కుటుంబీకులు తమపై ఆధారపడి ఉన్నారని గుర్తుంచుకొని వాహనం నడపాలని అవగాహన కల్పించారు. అలాగే పట్టణంలోని ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలోని ఆటో డ్రైవర్లకు వాహనదారులకు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి రోడ్డు సేఫ్టీ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.ఐ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img