ప్రధాని మోదీ, అమిత్‌షాతో నేడు భేటీ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మళ్లీ దిల్లీ వెళ్లారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన సచివాలయం నుంచి నేరుగా గన్నవరం చేరుకుని… అక్కడనుంచి ప్రత్యేక విమానంలో సీఎం హస్తినకు వెళ్లారు. రాత్రికి అక్కడే బసచేసి బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరికొంతమంది కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి హస్తిన బాట పట్టడంతో చంద్రబాబు పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. త్వరలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే హస్తిన పర్యటన కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.