London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

విధ్వంసాలు ఆపండి

. మా పార్టీ కార్యాలయాల్లోకి చొరబడతారా?
. తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు వైసీపీ నేతల విజ్ఞప్తి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి వైసీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, ప్రభుత్వ భవనాలపై విధ్వంసం జరుగుతున్నా సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కోరారు. శనివారం విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను వైసీపీ నేతల బృందం కలిసింది. తక్షణమే దాడులను అరికట్టాలని కోరింది. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 రోజులుగా తెలుగుదేశం, జనసేన పార్టీల శ్రేణులు వాళ్ల నాయకుల అధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడం, దారుణంగా అవమానించడం, ఇళ్ల మీద దాడులు చేయడం చేస్తున్నారని అన్నారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తులపైన వైఎస్సార్‌ పేరు ఉందని, పార్టీకి సంబంధించిన శిలా ఫలకాలు ఉన్నాయనే కారణంతో వాటిని ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. అప్పటికీ పోలీసులు స్పందించకపోవడంతో ఈ విషయాన్ని రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశామన్నారు. అయినప్పటికీ నేటికీ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అదే విధంగా ఉందని వివరించారు. వైసీపీకి ఓట్లేసిన దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాలను కూడా తగలబెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందన్నారు. పోలీసులు చోద్యం చూస్తున్నారేగానీ కనీసం కేసులు కూడా నమోదు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత విధ్వంసాల దృశ్యాల ఫొటోలను గవర్నరుకు చూపించగా, ఆయన ఇంత దారుణంగా పరిస్థితి ఉందా? అని ఆశ్చర్యపోయారని చెప్పారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వాళ్లు విజయాన్ని ఆస్వాదిస్తూ ఒక పద్ధతిలో ఓడిన వారికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేలా ఉండాలని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. ప్రతిపక్షంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. పార్టీలు కార్యాలయాలను కట్టుకోవడానికి 2014`19లో ఏరకమైన జీవో చంద్రబాబు తెచ్చారో అదేవిధంగా వైసీపీ కేటాయించిందని అయోధ్యరామిరెడ్డి అన్నారు. నిబంధనల ప్రకారమే పార్టీ ఆఫీసుల నిర్మాణం జరుగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 18 కార్యాలయాలు నిర్మాణం అయ్యాయని, దాదాపు రూ.60 కోట్ల వరకు ఖర్చు పెట్టామని చెప్పారు. కానీ రూ.500 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల దాకా ప్రజాధనం దుర్వినియోగమైనట్లు దుష్ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నారాయణ మూర్తి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img