Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఇన్వెస్టర్స్‌ గ్లోబల్‌ మీట్‌ – 14 ప్రధాన రంగాలలో పెట్టుబడులు రాబట్టేందుకు వ్యూహం..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మార్చి 3, 4 తేదీల్లో విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌లో పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రభుత్వం 14 ప్రధాన రంగాలను ఎంపిక చేసింది. ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో వీటిని హైలైట్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీటిలో ఏరోస్పేస్‌, రక్షణ రంగం, వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆటొ ?మొబైల్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, పునరుత్పాదక ఇంధనం, పెట్రోలియం, పెట్రోకెమి కల్స్‌, ఆరోగ్య సంరక్షణ మరియు వైద్య పరికరాలు, పారిశ్రామిక మరియు లాజిస్టిక్‌ మౌలిక సదుపాయాలు, నైపుణ్య అభివృద్ధి, విద్య, ఎంఎస్‌ఎంఈల స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, వస్త్రాలు, దుస్తులు, పర్యాటకం, ఆతిథ్యం, ఫార్మాస్యూటికల్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, ఉన్నత విద్య వంటి రంగాలు ఉన్నాయి. వీటన్నింటిని క్షేత్రస్థాయి నుండి వివరించేలా అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా యాక్షన్‌ ప్లాన్‌ను రెడీ చేస్తోంది. ఇదే సమయంలో ఈ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే తమ పెట్టుబుడులు ఎప్పటిలోగా, ఏ విధంగా తిరిగొస్తాయన్న దానిపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. ఇక పెట్టుబడులు రాబట్టుకోవడంతోపాటు లాభాలు పొందేందుకు ఉన్న అవకాశాలు, అందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఇక్కడున్న వనరులను తక్కవు ఖర్చుతో వినియోగించుకునే తీరు వంటి తదితర అంశాలపై కూలంకుశంగా పెట్టుబడుదారులకు అధికార యంత్రాంగం సవివరంగా తెలియజేయనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img