Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఆత్రేయపురం పూతరేకులకు అరుదైన గుర్తింపు

పూతరేకులు.. గోదావరి జిల్లాల పేరు చెప్పగానే మొదటగా గుర్తుకొస్తుంది. అందులోనూ ఆత్రేయపురం పూతరేకులు (A్‌తీవవaజూబతీaఎ ూబ్‌ష్ట్రaతీవసబశ్రీబ) అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా పూతరేకులకు ఓ ప్రత్యేకత ఉంది.. అలాంటి పూతరేకకు అరుదైన గౌరవం దక్కింది. ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించింది. కేంద్రంలో డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ రిజిస్ట్రీలో పూతరేకులు నమోదయ్యాయి. జీఐ (భౌగోళిక గుర్తింపు) కోసం డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పూతరేకుల సహకార సంఘం దరఖాస్తు చేసింది.
ఈ దరఖాస్తుపై స్పందించి.. ఫిబ్రవరి 13న విడుదల చేసిన జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ (జీఐ) జర్నల్‌లో ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై ప్రకటన ఇచ్చింది కేంద్రం సంస్థ. ఈనెల 13తో అభ్యంతరాల స్వీకరణకు ఇచ్చిన గడువు ముగియడం.. ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో భౌగోళిక గుర్తింపు వచ్చినట్లయిందని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పూతరేకుల సహకార సంఘం తెలిపింది.ఇలా జీఐను వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వస్తువులు, కళలు, ఆహార ఉత్పత్తుల గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉత్పత్తుల గుర్తింపు కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి.. అభ్యంతరాల స్వీకరణకు ప్రకటన జారీ చేస్తారు. ఆ వస్తువుకు ఎవరి నుంచీ అభ్యంతరాలు రాకుంటే.. ఆ వెంటనే జీఐను నమోదు చేస్తారు. ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు రావడంపై ఆనందం వ్యక్తం చేసింది సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పూతరేకుల సహకార సంఘం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img