Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

చెంతనే జలాలున్నా… సాగు, తాగునీటికి కటకటే!

సమస్య పరిష్కరానికి సీపీఐ పోరు: ముప్పాళ్ల

విశాలాంధ్ర`బొల్లాపల్లి : చెంతనే సాగు జలాలు ఉన్నా గుక్కెడు తాగు, సాగునీటిని అందించలేని స్థితిలో అసమర్థత అధికారులు, నాయకులున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో శనివారం పార్టీ నాయకులతో కలిసి ముప్పాళ్ల సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని గుట్లపల్లి, కండ్రిక, గంగుపల్లి , గంగుపల్లి తండాలలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి, సాగునీటి సమస్యలు గూర్చి క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన ముప్పాళ్ల తదితర నాయకులను ఆయా గ్రామాల రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఎదురుగా వచ్చి మండల ప్రధాన రహదారి వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులుతో కలిసి ముప్పాళ్ల సాగర్‌ ప్రధాన కాలువను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన రైతులు మాట్లాడుతూ రెండు దశాబ్ధాలుగా తమ నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలకు తాగు, సాగునీరు అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయా గ్రామాల్లో గల విశాలమైన విస్తీర్ణంతో కూడిన చెరువులు నేటికీ ఎండిపోయి ఉన్నాయని, సాగర్‌ కాలవ ద్వారా నీరు చేరవేస్తే వేల ఎకరాలకు పంటలు పండిరచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయమై అధికార, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కండ్రిక గ్రామానికి చెందిన రైతు అబ్రహం మాట్లాడుతూ పాలకులు ఎవరు మారినా తమ తలరాత మారలేదన్నారు. మా గ్రామాల నీటి సమస్యను పట్టించుకున్న వారు లేరని దీంతో విసుగు చెందిన రైతులు వలసలు వెళుతున్నారనీ, ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామాలు ఖాళీ అయిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో రైతు యోహాన్‌ మాట్లాడుతూ నాలుగు గ్రామాల ప్రజలకు తాగు , సాగునీరు లేదు కనీసం పశువులకు నీరు, మేత దొరకడం లేదని అధికారులకు ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోందన్నారు. ఈ తరుణంలో కమ్యూనిస్టుల జోక్యంతోనే తమ సమస్య పరిష్కారం అవుతుందని తెలుసుకొని మీ వద్దకు వచ్చామన్నారు. అనంతరం కండ్రిక గ్రామంలో 1967లో 42 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన చెరువును నాగేశ్వరరావు రైతులతో కలిసి సందర్శించారు. ఊర చెరువును పరిశీలించారు. కొత్తచెరువు దాని నుండి ఊర చెరువు దాని నుండి వెంకటపాలెం చెరువు, ట్యాంకులను సాగర్‌ జలాలతో నింపినట్లైతేనే తమ గ్రామాలు పచ్చగా ఉంటాయని లేకుంటే వలసలు తప్పవని రైతులు చెప్పారు. అనంతరం కండ్రిక గ్రామంలో రైతు నాయకులు యోహాను అధ్యక్షతన జరిగిన సభలో రైతులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల రైతుల పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిరచారు. చట్టసభల్లో పెట్టుబడిదారులు, ధనవంతులు ఉన్నందువల్లనే చట్టసభలు వ్యాపార కేంద్రాలుగా మారాయని, అలాంటి చోట్ల పేదల గోడు పట్టించుకునే వారు లేరని అన్నారు. పేదలు, రైతులు సంఘటితమై కదిలి వస్తే సమస్యల పరిష్కారం కష్టమేమీ కాదన్నారు. పేద వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా నిరంతరం అండగా నిలుస్తుందన్నారు. ఈ గ్రామాలలో సాగునీటి సమస్య పరిష్కరించే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామని ముప్పాళ్ల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, సీపీిఐ వినుకొండ నియోజకవర్గం కార్యదర్శి భూదాల శ్రీనివాసరావు, బొల్లాపల్లి మండల కార్యదర్శి పిన్నెబోయిన వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి సూర్య బ్రహ్మయ్య, గ్రామ నాయకులు వెంకటేశ్వర్లు, అబ్రహం, నాసరయ్య, ఎగయ్య, రాచమల్లు కొండలు, బైలడుగు కోటయ్య, ఆర్‌ వందనం, మల్లికార్జున, మస్తాన్‌, సాంబయ్య, పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img