మంగళగిరిలోని కోర్టుకు లోకేశ్ హాజరయ్యారు. టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ లో భారీ కుంభకోణం జరిగిందంటూ తనపై ఆరోపణలు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డిపై తెలుగుదేశం యువనేత నారా లోకేశ్ క్రిమినల్ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టుకు లోకేశ్ హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. తనపై అసత్య ఆరోపణలు చేసి, తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన వైసీపీ నేతలు పోతుల సునీత, గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా లోకేశ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనపై నిరాధార ఆరోపణలు చేసే వారిపై న్యాయ పోరాటం చేస్తానని ఆయన అన్నారు.