Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన పవన్‌

ఏపీ డిప్యూటీ సీఎం  పవన్‌కల్యాణ్‌ కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. మంగళవారం ఆయన ఆ కార్యాలయాన్ని పరిశీలించి అంగీకారం తెలిపారు. ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. నేరుగా విజయవాడలోని జలవనరులశాఖ అతిథి గృహం వద్దకు వెళ్లారు. డిప్యూటీ సీఎం కు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయితో కలిసి ఆ భవనాన్ని పవన్‌ పరిశీలించారు. పైఅంతస్తులో నివాసం.. కింది అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పక్కనే సమావేశమందిరం అందుబాటులో ఉండటంతో ఈ భవనంలో ఉండేందుకు పవన్‌ అంగీకరించినట్లు సమాచారం. అధికారులకు ఆయన కొన్ని మార్పులు సూచించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరివెళ్లారు. మధ్యాహ్నం సచివాలయంలో తన పేషీని పవన్‌ పరిశీలించనున్నారు. మరోవైపు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి ప్రాంత రైతులు సిద్ధమయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img