Friday, May 3, 2024
Friday, May 3, 2024

ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం

ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుత ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో 15.82 లక్షల క్యూసెక్కులు. నిరంతరం వరద ప్రవాహాన్ని విపత్తుల సంస్థ పర్యవేక్షిస్తోంది. సాయంత్రానికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉంది. మూడవ ప్రమాద హెచ్చరిక వస్తే 6 జిల్లాల్లోని 42 మండలాల్లో 524 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంబేద్కర్‌ కోనసీమ 20, తూర్పుగోదావరి లో 8 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉంది. అల్లూరి జిల్లాలో 5, పశ్చిమ గోదావరి 4 మండలాలు.. ఏలూరులో 3, కాకినాడ 2 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ వెల్లడిరచారు. సంబంధిత జిల్లాల, మండలాల అధికారులను విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img