Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

అమెజాన్‌ పే చెల్లింపులుపై భారీ ఆఫర్లు

బెంగళూరు: అమెజాన్‌.ఇన్‌లో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సమయంలో అమేజాన్‌ పేను వినియోగించడానికి 9 బహుమానపూర్వక విధాలున్నాయని ప్రకటించింది. విహార యాత్ర కోసం బుక్కింగ్‌ చేయాలని కోరుకున్నా, ధనత్రయోదశికి డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు చేయడానికి లేదా కుటుంబ సభ్యులకు డబ్బులు పంపించడానికి, అమేజాన్‌ పే క్యాష్‌ బాక్‌, డిస్కౌంట్లు, బంపర్‌ రివార్డ్స్‌ను వివిధ శ్రేణులలో అందిస్తోంది. ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో ప్రయాణంతోపాటు డిజిటల్‌ గోల్డ్‌ పై భారీ ఆదాలు పొందవచ్చు. అలాగే, ఊబర్‌, స్విగ్గీ, జొమేటో వంటి యాప్స్‌లో అద్భుతమైన ఆఫర్లు, మరిన్ని క్యాష్‌ బాక్‌ ఆఫర్లను పొందడానికి అమేజాన్‌ పే బ్యాలెన్స్‌ను టాప్‌ అప్‌ చేయవచ్చని తెలిపింది. అమేజాన్‌ పే లేటర్‌ యూజర్ల కోసం ప్రత్యేకమైన రివార్డ్స్‌ ఉంటాయనని, ప్రైమ్‌ క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్స్‌ కోసం పండగ ప్రయోజనాలుటాయని ప్రకటించింది. అన్ని చెల్లింపులు, రీఛార్జ్‌లు కోసం ప్రోత్సాహకాలు, అమేజాన్‌ పే గిఫ్ట్‌ కార్డ్స్‌పై సాటిలేని క్యాష్‌ బాక్‌ ఆఫర్లు కోసం అమేజాన్‌ పే యుపిఐని వాడాలని సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img