Monday, November 28, 2022
Monday, November 28, 2022

ఆక్వాథాన్‌ ద్వారా నిధుల సేకరణ


హైదరాబాద్‌ : ఇజ్రాయిల్‌ కేంద్రంగా కలిగిన సుప్రసిద్ధ ప్యూర్‌-ప్లే క్లౌడ్‌ నేటివ్‌ సెక్యూరిటీ ప్రదాత, ఆక్వా సెక్యూరిటీ. హైదరాబాద్‌లో సైతం కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సంస్ధ ఇటీవలనే తమ మొట్టమొదటి ఆక్వాథాన్‌ను ముగించింది. అంతర్జాతీయ ఉద్యోగ సంక్షేమ కార్యక్రమం ఆక్వాథాన్‌. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను నేరుగా భారతదేశపు కోవిడ్‌ ఉపశమన మద్దతు కోసం అందించనున్నారు. మరీ ముఖ్యంగా కరోనా వైరస్‌ కారణంగా కుటుంబంలో సంపాదనాపరులు మరణించిన ఎడల సహాయపడటాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img