హైదరాబాద్ : బంగారం ఋణాలను అందించడంలో అగ్రగామి అయిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) ఇండెల్ మనీ వినూత్నమైన రీతిలో సంప్రదాయ బంగారం ఋణ కో-లెండిరగ్ భాగస్వామ్యాన్ని ఇండస్ఇంక్ బ్యాంక్‌తో చేసుకుంది. దీనిద్వారా మరింత మంది ఋణగ్రహీతలకు సరసమైన వడ్డీరేట్లలో ఋణాలను అందించడం వీలవుతుంది. ఈ కో-లెండిరగ్ భాగస్వామ్య ఒప్పందం కింద ఇండెల్ మనీ, పరస్పరం సూత్రీకరించిన ఋణ ప్రమాణాలు, అర్హతల కింద బంగారం ఋణాలను ప్రాసెస్ చేయనుంది. అత్యంత కీలకమైన సోర్సింగ్, డాక్యుమెంటేషన్, కలెక్షన్, లోన్ సర్వీసింగ్ సహా ఋణ జీవిత చక్రంలో వినియోగదారులకు ఈ కంపెనీ సేవలనందిస్తుంది. ఈ కో లెండిరగ్ అమరిక ద్వారా సృష్టించబడిన వ్యాపారంలో 80% బంగారం ఋణాలను ఇండస్ ఇండ్ బ్యాంక్ తమ బుక్స్‌లోకి తీసుకుంటే, 20%కు ఇండెల్ మనీ ఫండిరగ్ అందించనుంది