Sunday, November 3, 2024
Sunday, November 3, 2024

టొయోటా అమ్మకాల్లో రికార్డు వృద్ధి

బెంగళూరు : టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) 2024 అక్టోబరు మాసంలో 30,845 యూనిట్లు విక్రయించినట్లు టీకేఎం తెలిపింది. ఇది పోస్ట్‌ రికార్డు వృద్ధిగా అభివర్ణిస్తుంది. 2023 అక్టోబరుతో పోల్చితే, 41% వృద్ధిని సూచిస్తుంది. ఏడాది క్రితం ఇదే మాసంలో 21,879 యూనిట్‌ విక్రయాలు జరిగాయి. 2024 అక్టోబరులో టీకేఎం దేశీయంగా 28,138 వాహనాలను విక్రయించగా, 2707 యూనిట్లను ఎగుమతి చేసింది. పరిమితకాల పండగ ఆఫర్లు, కాంపెయిన్ల కారణంగా ఈ రికార్డు వృద్ధి చోటు చేసుకుంది. కస్టమర్ల నుంచి బలమైన గిరాకీ ఉన్న నేపథ్యంలో రెండంకెల వృద్ధి సాధ్యమైంది. ఇక 2024 తొలి ఏడు మాసాల వ్యవధిలో టీకేఎం ఏకంగా 1,93,468 యూనిట్లు విక్రయించి గొప్ప మైలురాయిని చేరుకుంది. గత ఏడాది ఇదేకాలంలో 1,45,818 యూనిట్లు అమ్మడంతో ఈసారి 33% వృద్ధిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ కంపెనీ తన ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంచింది. మూడు షిఫ్ట్‌ల ఆపరేషన్స్‌ను కూడా ప్రారంభించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img