హైదరాబాద్ : ఇటీవల 160 మిలియన్ల డౌన్లోడ్ మార్కును తాకిన వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యుసిసి) ఇప్పుడు తెలుగు వెర్షన్ను కూడా పరిచయం చేసింది, భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత ఐపిఎల్ వ్యాఖ్యాత వెంకటపతి రాజు దీనికి తన వాఖ్యానాన్ని అందించారు. ఇంగ్లీష్ బౌలర్, ప్రముఖ కాలమిస్ట్, బిబిసి క్రికెట్ వ్యాఖ్యాత ఇసా గుహ ఆటకు చెందిన ఇంగ్లీష్ కామెంటరీ జాబితాలో మాథ్యూ హేడెన్తో కలిసి పంచుకుంటున్నారు. ఆకాష్ చోప్రా మరియు అభినవ్ ముకుంద్లు వరుసగా హిందీ, తమిళంలో తమ వ్యాఖ్యానాలను అందిస్తున్నారు.